సూర్యాపేట కలెక్టరేట్ లో పాము కలకలం

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో పాము కలకలం రేపింది. మంగళవారం జిల్లా  స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆఫీస్ ఓపెన్ చేసే సమయంలో 5 అడుగుల త్రాచు పాము లోపలికి వెళ్లడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. దీనితో సెక్యూరిటీ సిబ్బంది పామును కర్రలతో దాడి చేసి చంపేశారు. పాము ఆఫీస్ లోకి రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.