జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పాము ప్రత్యక్షం.. గగ్గోలు పెట్టిన ప్రయాణికులు

జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పాము ప్రత్యక్షం.. గగ్గోలు పెట్టిన ప్రయాణికులు

జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పాము కలకలం రేపింది. ఈ ఘటన రైలు భోపాల్‌ నుంచి జబల్‌పూర్‌ వెళ్తున్నప్పుడు చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు పాముకు దూరం జరిగి పోగా.. మరికొందరు దాని కంట పడకుండేందుకు సీట్లలో నక్కి నక్కి కూర్చున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతోన్న వీడియోలో పాము సీట్ల పైన ఉన్న లగేజీ రాక్‌పై విశ్రాంతి తీసుకుంటుంది. పామును గుర్తించిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తంగా తమ సీట్ల నుండి దూరంగా వెళ్లిపోయారు. ఇక, పామంటే భయమున్నోళ్ల సంగతి దేవుడెరుగు. గమ్యస్థానం వచ్చే దాకా దాని వంక చూస్తూనే కూర్చున్నారట. ఈ ఘటన భారతీయ రైల్వేలో భద్రత, పరిశుభ్రత గురించి ఆందోళనలను లేవనెత్తడంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ విచారణ మొదలు పెట్టింది.

ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్‌లో జబల్‌పూర్-ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో పాము కనిపించింది.

ALSO READ | మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో స్వతంత్ర అభ్యర్థి మృతి