క్రికెట్ స్టేడియంలోకి పాము రావడం సహజమే అయినా.. పదే పదే ఒకే చోట కనిపించటం ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ ఘటన శ్రీలంక వేదికగా జరుగుతోన్న లంక ప్రీమియర్‌లో చోటు చేసుకుంది.
సరిగ్గా 11రోజుల క్రితం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా గాలె టైటాన్స్, దంబుల్ల ఆరా టీమ్స్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఒక పాము అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో గాలె టైటాన్స్ బౌలింగ్ చేస్తుండగా ఓ పాము ఎంట్రీ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
LPL match was interrupted after snake invaded the field.pic.twitter.com/SUF7iVf2St#LPL | #LPL2023
— Saikat Ghosh (@Ghosh_Analysis) July 31, 2023
అదే పాము.. అదే జట్టు.. అదే స్టేడియం
అదే పాము మరోసారి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందునా దంబుల్ల ఆరా టీమ్ మ్యాచ్ జరుగుతుండగానే పాము ప్రత్యక్షమైంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఓ ప్లేయర్.. పాము తచ్చాడున్నట్లు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కెమెరామెన్ పాము వెళ్తున్న దృశ్యాలను స్క్రీన్‌పై చూపించారు. బౌండరీ లైన్ వెంబడి పాము పాకుతుండడంతో ఓ కెమెరామెన్ అక్కడ నుండి జారుకున్నాడు.
Snake makes an entry in Colombo after 11 days ?#LPL2023 #LPLT20 pic.twitter.com/RwA5dNIyQV
— Farid Khan (@_FaridKhan) August 12, 2023
ఈ విషయాన్ని నెటిజెన్స్ చాలా లోతుగా చర్చిస్తున్నారు. దాని స్థావరం అక్కడే అయినా ఉండాలి లేదంటే ఎవరి మీదైనా పగబట్టైనా ఉంటాలంటూ కామెంట్లు పెడుతున్నారు.