జపాన్ దేశంలోని బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాంటి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ లో ఆగే సమయం ఇతర ట్రైన్ తో పోల్చితే తక్కువగానే ఉంటుంది. అయితే జపాన్ లోని షింకన్‍సెన్ అనే బుల్లెట్ రైలులోకి 40 సెంటీమీటర్ల పొడవున్న ఓ విష సర్పం దూరింది. దీని వల్ల ఒసాకా స్టేషన్ కు వెళ్లాల్సిన ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం అయింది. నగోయా, టోక్యో మధ్య నడిచే షింకన్‍సెన్ బుల్లెట్ ట్రైన్‌లో సుమారు16 -అంగుళాల పాము ఉందని ఓ ప్యాసింజర్ సెక్కూరిటీకి చెప్పాడు.
దీంతో ఆ పామును పట్టుకోవడానికి ట్రైన్ ను 17 నిమిషాల నిలిపారు. ఎట్టకేళకు పామును ట్రైన్ నుంచి బయటకు తీశారు. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. భద్రతా సిబ్బంది లోటుపాట్ల కారణంగానే పాము లోపలికి వచ్చిందని ప్యాసింజర్లు ఆరోపిస్తున్నారు. అయితే సెక్యూరిటీ చెకింగ్ సిబ్బంది మాత్రం ప్యాసింజర్ల లగేజ్ చెక్ చేసేందకు వారికి అవకాశం లేదని, అందువల్లే ట్రైన్ లోని పాము వచ్చిందని చెప్తున్నారు.