ముస్లాపూర్​స్కూల్​లో ఎనిమిది కట్ల పాములు! 

ముస్లాపూర్​స్కూల్​లో ఎనిమిది కట్ల పాములు! 
  • మెదక్​ జిల్లా ముస్లాపూర్​స్కూల్​లో బయటపడ్డ సర్పాలు 
  • చంపేసిన సిబ్బంది
  • బడికి వెళ్లడానికి భయపడుతున్న స్టూడెంట్స్​

మెదక్ (అల్లాదుర్గం), వెలుగు : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో పాములు స్టూడెంట్స్​ను భయపెట్టాయి. ఇక్కడి పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం స్కూల్​యూనిఫాంలు పంపిణీ చేస్తుండగా ఓ స్టూడెంట్​కు స్కూల్ ఆవరణలో కట్ల పాము కనిపించింది. ఈ విషయాన్ని  టీచర్ కు చెప్పగా అక్షయ పాత్ర సిబ్బంది ఆ పామును చంపేశారు.

అదే సమయంలో మరో పక్క నుంచి ఒకటి తర్వాత ఒకటి ఇలా వరుసగా ఏడు కట్ల పాములు బయటకు వచ్చాయి. మొత్తం ఎనిమిది పాములను చంపేశారు. అయితే ఇంకెన్ని పాములు ఉంటాయోనని బడికి వెళ్లడానికి స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు.