ఎయిర్పోర్టులో కలకలం ...బ్యాగుల నిండా పాములే

 ఎయిర్పోర్టులో కలకలం ...బ్యాగుల నిండా పాములే

విదేశాల నుంచి వచ్చే వాళ్లు ఎవరైనా తమకు నచ్చిన వస్తువులను తెచ్చుకుంటారు.  కానీ ఇక్కడో మహిళ బ్యాగుల నిండా పాములను తెచ్చుకుని షాకిచ్చింది. అనుమానం వచ్చి తనిఖీలు చేసిన అధికారులకు వివిధ జాతలకు చెందిన 22 పాములను కనిపించాయి. దీంతో మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు మన దేశంలోని  చెన్నై ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది.  

ఓ మహిళ ప్రయాణికురాలి లగేజ్ బ్యాగ్ లో  పాములు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఏప్రిల్ 28 శుక్రవారం రోజున మలేషియా నుంచి చెన్నైకి ఏకే 13 ప్లైట్ లో వచ్చిన  మహిళా ప్రయాణికురాలి బ్యాగును అధికారులు తనిఖీ చేస్తు్ండగా విషసర్పాలు బయటకు వచ్చాయి. ఊసరవెల్లితో పాటు వివిధ జాతలకు చెందిన 22 పాములను కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అందులో 10అడుగులకు పైగా పొడవైన పాములు ఉండడం చూసి తోటి ప్రయాణికులు షాకు గురయ్యారు.కస్టమ్స్ యాక్ట్ 1962, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చట్టాల కింద మహిళను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు  అరెస్టు చేశారు.  మహిళను ఏప్రిల్ 29 శనివారం రోజున  స్థానిక కోర్టులో హాజరుపరచగా, ఆమెకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. అధికారుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు  పాములను  ఎయిర్పోర్టు నుంచి సురక్షింతంగా తరలించారు.