బీర్ తాగేందుకు వచ్చి ఇరుక్కుపోయిన నాగుపాము..

బీర్ తాగేందుకు వచ్చి ఇరుక్కుపోయిన  నాగుపాము..

అనవసరంగా దేంట్లోనూ  తలదూర్చకూడదని పెద్దలు ఎందుకంటారో ఈ ఫోటోను చూసే అర్థమవుతుంది.  ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే కూడా ఇలానే ఉంటుందేమో మరి. ఓ పాము బీర్ టిన్లో మూతిపెట్టి ఇరుక్కుపోయింది. బీరు చుక్క వాసన వచ్చిందో..బీరు టేస్ట్ చేయాలని అనుకుందో ఏమో కానీ..ఓ టైగర్ పాము..బీర్ టిన్లో తల పెట్టి ఇరుక్కుపోయింది. ఎంతకు బయటి రాక..నరకయాతన అనుభవించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

3 నిమిషాల  వీడియోలో  విషపూరితమైన టైగర్ స్నేక్..బీర్ టిన్లోకి చొరబడింది. బీర్ను టేస్ట్ చేయాలని అనుకుందో ఏమో కానీ....బీర్ టిన్లోకి వెళ్లింది. అయితే అందులో ఉన్న కొద్దిగా బీర్ను తాగిన తర్వాత మరో రంధ్రం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. కానీ బయటకు రాలేక ఇరుక్కుపోయింది. 

రక్షిద్దామనుకుంటే బుసలు కొట్టింది..

 ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి బీర్ టిన్లోకి పాము వెళ్లడాన్ని  గమనించి దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ తనను చంపేందుకు వచ్చాడని పొరబడిన పాము..అతనిపై బుసలు కొట్టింది. కాటు వేసేందుకు ప్రయత్నించింది. అయినా అతను దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. చివరకు కట్టింగ్ ప్లేయర్తో బీర్ టిన్ను కోసి పామును రక్షించాడు. అనంతరం కొద్ది దూరంలోని  అడవిలో వదిలి పెట్టాడు. 

ఈ వీడియోను @thedodo అనే వ్యక్తి తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశాడు. అప్పటి నుంచి దాదాపు 2 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. 2500 మంది లైక్స్ చేశారు. ఎంతో రిస్క్తో పామును కాపాడిన వ్యక్తిని ట్విట్టర్ యూజర్లు  ప్రశంసించారు.