స్నాప్​చాట్​లో డైనమిక్ స్టోరీస్

స్నాప్​చాట్​లో డైనమిక్ స్టోరీస్

యూజర్ల కోసం కొత్త అప్​డేట్ తెచ్చింది స్నాప్​చాట్. పేరు డైనమిక్ స్టోరీస్. దీనికి స్నాప్​చాట్ స్టోరీలకు తేడా ఏంటంటే... ఈ ఫీచర్ సాయంతో కంటెంట్ క్రియేటర్స్ లేటెస్ట్ న్యూస్ అప్​డేట్స్ తెలుసుకోవచ్చు. అందుకోసం ఆర్​ఎస్ఎస్ (రియల్లీ సింపుల్ సిండికేషన్) ఫీడ్​... అంటే.. అప్పటివరకు యూజర్లకు వచ్చిన నోటిఫికేషన్ల వివరాల్ని ఉపయోగించుకుంటుంది స్నాప్​చాట్. దీని సాయంతో ఆటోమెటిక్​గా కంటెంట్ స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. వీటిని కంటెంట్ క్రియేటర్స్​కి లేటెస్ట్ న్యూస్ అప్​డేట్స్​గా పంపిస్తుంది. 

ఈ కొత్త ఫీచర్​ ఉంటే.. వెబ్​లో ఏ విషయం గురించైతే మాట్లాడుతున్నారో, దానికి సంబంధించిన అప్​డేట్స్​ని కంటెంట్ క్రియేటర్స్ వెంటనే తెలుసుకోవచ్చు. మన దేశంలో ‘టైమ్స్​ నౌ, వోగ్​ ఇండియా, జిక్యు ఇండియా, ది క్వింట్, మాలిని మిస్, స్పోర్ట్స్​కీడా’ వంటి సంస్థలు డైనమిక్ స్టోరీల కోసం​ స్నాప్​చాట్​తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.