టెక్నాలజీ : శ్నాప్​ మ్యాప్ .. ఏఏ ప్లేస్​లకు వెళ్లారో ట్రాక్ చేస్తుంది

టెక్నాలజీ : శ్నాప్​ మ్యాప్ .. ఏఏ ప్లేస్​లకు వెళ్లారో ట్రాక్ చేస్తుంది

శ్నాప్​చాట్ యాప్ వాడుతున్న ఐఒఎస్​ యూజర్ల ఫుట్ స్టెప్స్​ని ట్రాక్ చేస్తుందట. శ్నాప్​ మ్యాప్ వాడి వాళ్లు ఏఏ ప్లేస్​లకు వెళ్లారో ట్రాక్ చేసి చెప్తుంది ఈ యాప్. దీంతో మెమరీస్​ని క్రియేట్​ చేస్తుంది. అలాగే లొకేషన్ డాటాను స్టెప్స్ ద్వారా ట్రాక్ చేస్తుంది. గతంలో ఈ ఫుట్ స్టెప్స్ ఫీచర్ శ్నాప్​చాట్ యూజర్లకు మాత్రమే ఉపయోగపడేది. కానీ, ఇప్పుడు ఐఒఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. 

ఈ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్​గా ఉంటుంది. అకౌంట్​ హోల్డర్​కి మాత్రమే యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఘోస్ట్ మోడ్​లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇతరులకు లొకేషన్ కనపడకుండా హైడ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఈ ఫీచర్ వాడకూడదు అనుకుంటే.. ఫుట్ స్టెప్ హిస్టరీని డిలీట్ చేయొచ్చు.