కొత్త ఫీచర్​ లాంచ్ చేయనున్న స్నాప్ చాట్

కొత్త ఫీచర్​ లాంచ్ చేయనున్న స్నాప్ చాట్

పాపులర్​ సోషల్​మీడియా యాప్ స్నాప్​చాట్​ కొత్త ఫీచర్​ తెచ్చింది. ఈ ఫీచర్​తో యూజర్లు తమ యూజర్​ నేమ్​ మార్చుకోవచ్చు. కుడివైపు ఉండే బిట్​మొజి ఐకాన్​ మీద క్లిక్​ చేసి, యూజర్​ నేమ్​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. కొత్త యూజర్​ నేమ్​ పెట్టుకోవాలి. ఈ ఫీచర్ ఐఒఎస్​, ఆండ్రాయిడ్​ ఫోన్లలో ​ పనిచేస్తుంది. అయితే, యూజర్లు ఏడాదికి ఒకసారి మాత్రమే యూజర్​ నేమ్​ మార్చుకునే అవకాశం ఉంది.  గతంలో ఒక యూజర్​కి ఉన్న యూజర్​ నేమ్​ని  వాడొద్దు. అంతేకాదు ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​ లెక్కనే క్రియేటర్స్​కి డబ్బులు వచ్చేలా స్నాప్​చాట్ స్టోరీల మీద యాడ్స్​ని పర్మిట్​ చేయాలి అనుకుంటోంది ​స్నాప్​చాట్​. ఈ కొత్త ఫీచర్​ని అమెరికాలోని కొందరు క్రియేటర్స్​ మీద టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్​ని అందుబాటులోకి తేనుంది.