హైదరాబాద్, వెలుగు: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీశ్ తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. శుక్రవారం ఆమెను కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శనివారం ఆమెను తిరిగి జీహెచ్ఎంఐసీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
ఆమెకు బదులుగా జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చిన వెంకటేశ్దాత్రేను ఆసిఫాబాద్కలెక్టర్గా నియమించింది. స్నేహ శబరీశ్జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా కొనసాగనున్నారు. గతంలో జోనల్ కమిషనర్ గా మమత ఉన్న సమయంలోనూ ఉత్తర్వులు ఇలాగే వచ్చాయని బల్దియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.