Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు

Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు

రంజీ ట్రోఫీలో భాగంగా ఆల్ టైం రికార్డ్ ఒకటి బద్దలైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బ్యాటర్లు స్నేహల్ కౌతంకర్,కశ్యప్ బక్లే రంజీ ట్రోఫీ చరిత్రలో 600కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు. మూడో వికెట్ కు వీరిద్దరూ అజేయంగా 606 పరుగులు జోడించి.. 2016-17 రంజీ సీజన్ లో స్వప్నిల్ సుగాలే, అంకిత్ బవానే నెలకొల్పిన 594 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశారు. 

వీరిద్దరూ అరుణ చల్ ప్రదేశ్ బౌలర్లను ఒక ఆటాడుకుంటూ ఏకంగా ట్రిపుల్ సెంచరీలు కొట్టారు. కౌతాంకర్ కేవలం 205 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు బక్లే తన ట్రిపుల్ సెంచరీకి 269 బంతులు తీసుకున్నాడు. ఒకే మ్యాచ్ లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు కొట్టడం రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది కేవలం రెండో సారి మాత్రమే. 1988-89లో తమిళనాడు బ్యాటర్లు రామన్ (313), అర్జన్ కృపాల్ సింగ్ (302) గోవాపై ట్రిపుల్ కొట్టారు. 

ALSO READ | Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ

గురువారం పోర్వోరిమ్‌లో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వీరిద్దరి ధాటికి గోవా తమ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి  727 పరుగులు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. అంతకముందు అరుణాచల్‌ ప్రదేశ్ ను కేవలం 84 పరుగులకే అవుట్ చేసిన గోవా తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 643 పరుగుల ఆధిక్యం సాంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణ చల్ ప్రదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది.