
ఈ మధ్య రోజుకో కంపెనీ బోర్డు తిప్పేస్తోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు ఇలా రోజుకో చోట సామాన్యులకు కుచ్చుటోపి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నాయి. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో స్నేహ మ్యాక్స్ అనే సంస్థ డిపాజిట్లు సేకరించి వందకోట్లతో బోర్డు తిప్పేసింది.
విశ్రాంత ఐఆర్ఎస్ ఉద్యోగి భాగ్యరావు స్నేహా మాక్స్ సంస్థ స్థాపించాడు. ప్రతినెలా 12 శాతం వడ్డీతో డబ్బులు చెల్లిస్తామని అందరిని నమ్మించి డిపాజిట్లు సేకరించాడు. అయితే గత రెండేళ్లుగా డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. 2008 నుంచి రిటైర్డ్ ఉద్యోగులు, సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించినట్టు చెప్పారు. సుమారు 3 వేల మంది నుంచి దాదాపు 100 కోట్లు సేకరించి బినామీల పేర్లతో ఆస్తులు కొన్నట్టు చెబుతున్నారు బాధితులు. దళిత ఉద్యోగులు నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేశాడని ఆరోపించారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్నేహా మాక్స్ సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు బాధితులు.