స్నేహితారెడ్డికి ఓయూ నుంచి మూడు గోల్డ్‌‌ మెడల్స్‌‌

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పవర్‌‌హౌస్‌‌ కాలనీకి చెందిన ఎన్‌‌.స్నేహితరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మూడు గోల్డ్‌‌ మెడల్స్‌‌ సాధించారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌‌ కెమిస్ట్రీలో ప్రతిభ కనబరిచి, గవర్నర్‌‌ తమిళ్‌‌సై చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నది. కాగా స్నేహితరెడ్డి తండ్రి సదాశివరెడ్డి సింగరేణి ఆర్జీ 1 డివిజన్‌‌కు చెందిన జీవిటీసీలో ఓవర్‌‌మెన్‌‌గా పనిచేస్తున్నాడు. సింగరేణి ఉద్యోగి కూతురు మూడు గోల్డ్‌‌ మెడల్స్‌‌ సాధించడం పట్ల ఆమెను జీవీటీసీ మేనేజర్‌‌ డేనిల్‌‌ కుమార్‌‌, అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌ ఎస్‌‌.విజిత్‌‌, ఏఈ వేణుగోపాల్‌‌ అభినందించారు.