Mount Fuji: మంచు రహితమైన ఫుజి పర్వతం

Mount Fuji: మంచు రహితమైన ఫుజి పర్వతం

జపాన్​లో అత్యంత ఎత్తయిన ఫుజి పర్వత వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ దట్టమైన మంచుతో కప్పి ఉండే ఫుజి పర్వతం 130 ఏండ్ల చరిత్రలో మొదటిసారిగా అక్టోబర్​ నెలలో రికార్డు స్థాయిలో మంచు రహితమైంది. సాధారణంగా అక్టోబర్​ నెల ప్రారంభంలో ఈ పర్వత ప్రాంతంలో మంచు కురుస్తుంది. కానీ గ్లోబల్​ వార్మింగ్​ కారణంగా మంచు కురవడం లేదని పర్యావరణ నిపుణులు నివేదించారు. 

జూన్​, జులై, ఆగస్టు నెలల్లో ఉష్ణోగ్రతలు 1.06 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా 1.76 డిగ్రీల సెల్సియస్​తో రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. అలాగే, సెప్టెంబర్​ నెలలో ఉప ఉష్ణమండల జెట్​ స్ట్రీమ్స్​ వల్ల ఉష్ణోగ్రతలు ఊహించిన దాని కంటే ఎక్కువ నమోదయ్యాయి. 

ఫుజి పర్వతం

  • మౌంట్​ ఫుజి జపాన్​లో అత్యంత ఎత్తయిన పర్వతం. దీని ఎత్తు 12,460 అడుగులు, దీనిని ఫుజి శాన్​ అని కూడా పిలుస్తారు. 
  • ఫుజి పర్వతాన్ని గోరైకో అని కూడా పిలుస్తారు. అంటే కాంతి రాక అని అర్థం. 
  • ఫిలిప్పీన్స్ సముద్ర పలక కింద పసిఫిక్​ పలక విచ్ఛిన్నం కావడం వల్ల ఫుజి పర్వతం ఏర్పడింది. 
  • ఈ పర్వతం హోన్షు అనే పెద్ద ద్వీపానికి సమీపంలో ఉంది. 
  • ఫుజి పర్వతం టండ్రా వాతావరణాన్ని కలిగి ఉంటుంది.