భారీ సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్‎లోనే 8 సినిమాలు

కరోనాతో దాదాపు రెండేండ్లుగా సినీ రంగం ఆగమైంది. మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో క్రమక్రమంగా సినిమాల విడుదలలో చిత్ర బృందాలు వేగం పెంచాయి. కరోనాతో సినిమా థియేటర్‎కు దూరమైన ప్రేక్షకులు.. మెల్లమెల్లగా థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు.  దాంతో ఎప్పుడో మొదలైన సినిమాలతో పాటు తాజాగా మొదలైన సినిమాలు కూడా వేగవంతంగా షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. కరోనా తర్వాత విడుదలైన లవ్ స్టోరీ, అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులను థియేటర్ వరకూ తీసుకురాగలిగాయి. అభిమానుల తీరు మారడంతో.. మరికొన్ని సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఏప్రిల్ నుంచి మొదలుకొని సెప్టెంబర్ వరకు తమ సినిమా విడుదల తేదీలను బుక్ చేసుకున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 8 సినిమాలు విడుదలకానున్నాయి. మే నెలలో 3 సినిమాలు, జూన్‎లో 3 సినిమాలు, జూలైలో 5 సినిమాలు, ఆగష్టులో 2 సినిమాలు, సెప్టెంబర్‎లో ఒక సినిమా విడుదలకానున్నాయి. ఈ సినిమాలలో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఉన్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, మాస్ మహారాజ్ రవితేజ, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, వెంకటేష్, నాని, గోపిచంద్, ప్రభాస్, తమిళ నటుడు విజయ్, విక్రం,  తదితర నటుల సినిమాలు కూడా ఉన్నాయి.

 

For More News..

పెంచేది బీజేపీ అయితే... పంచేది టీఆర్ఎస్

రూ. 59కే రోజంతా మెట్రోలో ప్రయాణం

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు