నన్ను చంపాలంటే వారికి 100 సార్లు అదృష్టం ఉండాలి.. నాకు ఒక్కసారి ఉంటే చాలు

గత కొన్ని రోజుల క్రితం గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ముంబై పోలీసులు వైప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించారు. ఈ సందర్భంగా ఆయనకు వస్తోన్న బెదిరింపు కాల్స్ పై తాజాగా ఇండియాన్ ఫేమస్ టీవీ షో ఆప్ కీ అదాలత్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనకు భద్రత ఉందన్న మాట నిజమేనన్న ఆయన.. అభద్రత కంటే ఎక్కువ భద్రత ఉందని చెప్పారు. ప్రస్తుతం  రోడ్డుపై సైకిల్ తొక్కడం, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లడం లాంటివి తనకు సాధ్యం కాదని చెప్పారు. గతంలో కొంతైనా బయటకు వెళ్ళే స్వేచ్ఛ ఉండేదని, కానీ ఇప్పుడది లేదని తెలిపారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు తనను కాపాడటానికి సెక్యూరిటీ ఉంటుదన్నారు. దాని వల్ల తనను ప్రేమించే అభిమానులకు ఓ రకంగా దూరంగా ఉండాల్సి వస్తుందని అన్నారు. అందుకే తనకు బద్రత ఉందని అంటున్నారని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.

ఈ భద్రత వల్ల తాను తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నట్టు సల్మాన్ ఖాన్ వెల్లడించారు. తాను ఏది చెబితే అదే చేస్తున్నానన్న ఆయన.. ఇటీవల రిలీజైన‘కిసీకా భాయ్, కిసీ కీ జాన్’లో చెప్పినట్టు... తనను చంపాలనుకునే వాళ్ళకు 100 సార్లు అదృష్టం ఉండాలని, కానీ తనకు ఒక్కసారి ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. తాను ఎంత సెక్యూరిటీతో ఉంటున్నా.. ఏమి చేసినా జరగబోయేది మాత్రం జరుగుతుందని తనకు తెలుసని సల్మాన్ వెల్లడించారు. పైన దేవుడు ఉన్నారని, స్వేచ్ఛగా తిరగడం ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు.. తన చుట్టు తుపాకుల తిరుగుతున్నాయని.. ఇప్పుడు తాను ఇబ్బంది పడొచ్చు.. కాని స్వేచ్చగా తిరిగే రోజులు ముందున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.