Naga Chaitanya and Sobhita: చైతూపై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రెండు గంటలు అదే చేస్తాడంటూ..

Naga Chaitanya and Sobhita: చైతూపై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రెండు గంటలు అదే చేస్తాడంటూ..

టాలీవుడ్ ప్రముఖ హీరో నాగ చైతన్య ఈ ఏడాది "తండేల్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇటు మ్యూజికల్ గా, అటు కమర్షియల్ గా బాగానే హిట్ అయ్యింది. అంతేకాదు నాగ చైతన్య కెరీర్ లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సోలో సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే నాగ చైతన్య గత ఏడాది తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ ని పేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే నటి చైతూ దంపతులు తమ వైవాహిక జీవితంపై స్పందించారు. ఇందులోభాగంగా శోభిత చైతూపై పలు ఆసక్తి వాఖ్యాలు చేసింది. 

చైతూ ప్రేమించినవారిని లేదా ఫ్రెండ్స్ ని చాలా కేరింగ్ గా చూసుకుంటాడని తెలిపింది. ఇక రియల్ లైఫ్ లో కూడా చాలా సింపుల్ గా ఉంటాడని చెప్పుకొచ్చింది. ఇష్టమైన వ్యక్తులనేకాదు ఇష్టపడి కొనుక్కున్న వస్తువులను కూడా చాలా కేరింగ్ గా చూసుకుంటాడు.. ఇందులో ముఖ్యంగా తనకి ఇష్టమైన మోటార్ సైకిల్ ని క్లీన్ చెయ్యడానికి దాదాపుగా రెండు గంటల సమయం వెచ్చిస్తాడని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో చాటింగ్ తో మొదలైన తమ లవ్ జర్నీ పెళ్లి వరకూ వెళుతుందని, అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొంది. కానీ చైతూ లైఫ్ లో చాలా క్లారిటీతో ఉంటాడని అందుకే తమ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లిందని అభిప్రాయం వ్యక్తం చేసింది.. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VOGUE India (@vogueindia)

ఈ విషయం ఇలా ఉండగా ఈ జంట గత ఏడాది డిసెంబర్ 4న ఇరువురి పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సినీ సెలబ్రెటీలు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. అయితే చైతూ ప్రస్తుతం శోభిత తో కలసి తండేల్ సక్సెస్ ని ఈనిజాయి చేస్తున్నాడు. దీంతో డిన్నర్, రేసింగ్, ఫోటో షూట్లు అంటూ ఛిల్ అవుతున్నారు.

ALSO READ | ఆ స్టార్ హీరో ఫుల్ గా మందుకొట్టి సెట్స్ కి వచ్చేవాడు: వెటరన్ హీరోయిన్