టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ 2024 ఆగస్టు 8న గ్రాండ్గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ మధ్యే శోభితా ధూళిపాళ్ల ఇంట్లో తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. శోభితా పసుపు దంచుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ ఇస్తూ ఫోటోలు షేర్ చేయగా అక్కినేని ఫ్యాన్స్ను బాగా ఇంప్రెస్ చేశాయి. అయితే.. సోమవారం అక్టోబర్ 28న జరిగిన ANR అవార్డ్స్ కార్యక్రమంలో ఈ జంట ఎంతో ఉత్సాహంగా కనిపించారు. దాంతో పెళ్లి తేది ఎప్పుడంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వీరి పెళ్లి తేదీ ఫిక్సయినట్లు తెలుస్తోంది. 2024 డిసెంబర్ 4న నాగ చైతన్య - శోభితల వివాహం జరగనుందని సినీ సర్కిల్లో టాక్ మొదలైంది. త్వరలో వీరి పెళ్లి తేదీపై ఇరు కుటుంబాలు అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ అక్కినేని వారి పెళ్లి వైజాగ్ లోనే జరగనుందని సమాచారం.
Naga Chaitanya & Sobhita Dhulipala 💕#ANRNationalAward @AnnapurnaStdios pic.twitter.com/TSCazcCPZE
— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) October 28, 2024
ప్రస్తుతం శోభిత సినిమాల విషయానికొస్తే..బాలీవుడ్, హాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. శోభితా లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ వెబ్ ‘లవ్ సితార’ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు.ఇకపోతే చై తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.