
అక్కినేని నాగచైతన్య(Nagachaithanya)..ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ శోభితతో ఆగస్టు 8న సాంప్రదాయక పద్దతిలో చై నిశ్చితార్థం చేసుకుని కొత్త చాప్టర్ స్టార్ట్ చేసాడు. అయితే ఈ వేడుకలో శోభితా ధూళిపాళను అందంగా చూపించిన క్రెడిట్ వెనుక ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఉన్నారు. ఇక్కడ ఆమె చీరను తన నేపథ్యం, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చేలా చేనెత పట్టు చీరును ఎంచుకోవడమే గాక తలలో ధరించిన కనకాంభరం పూలు ఆరణాలా తెలుగింటి ఆడపడచంటే ఏంటో తనదైన ఫ్యాషన్ స్టైల్‌లో చెప్పకనే చెప్పింది. వివరాల్లోకి వెళితే..
ఈ నిశ్చితార్థ వేడుకలో శోభిత ధరించిన చీర ఉప్పాడ పట్టుతో తయారు చేయబడినట్లు ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ పోస్టులో ఈ జంట యొక్క అందమైన ఫొటోస్ షేర్ చేస్తూ..వారి అద్భుతమైన వేషధారణను హైలైట్ చేస్తూ..దీన్ని సాంస్కృతిక గురించి ఇలా చెప్పుకొచ్చారు.
"ఇది ఆంధ్రప్రదేశ్‌లోని హస్తకళకు ప్రసిద్ధి చెందిన వస్త్రం.ఆమె చీర, కనకాంబరం (సాంప్రదాయ ఆలయ పుష్పం) మరియు పద్మం (కమలం)ను గుర్తుకు తెచ్చే బంగారు బ్లష్ రంగులో, శోభితా సాంప్రదాయ సౌందర్యానికి అద్దం పట్టింది.అలాగే ఆమె దుస్తులు యొక్క సిల్హౌట్ దక్షిణ భారతదేశంలోని యువతులు ధరించే సాంప్రదాయ చీర నుండి తీసుకోబడింది మరియు ప్రఖ్యాత తెలుగు కళాకారుడు 'బాపు' చిత్రాలచే ప్రభావితమైంది.
నాగ చైతన్య పట్టు పంచ, లాల్చీ మరియు కండువాలతో కూడిన సాంప్రదాయ మూడు ముక్కల ఆంధ్ర ప్రదేశ్ అబ్బాయిలు ఎక్కువగా ధరించే పట్టుపంచ, లాల్చీ, కండువాన్ని ధరించడం విశేషం. వీరిద్దరూ తాము వచ్చిన మూలాలను, సంస్కృతిని మర్చిపోలేదు అనే చెప్పేలా వారి ఆహార్యం ఉంది. ఈ మేరకు డిజైనర్ ఇన్‌స్టాగ్రాం వేదికగా ఈ జంటను అభినందించారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.