శోభితా ధూళిపాళ్ల లవ్ సితార ట్రైలర్ రిలీజ్

శోభితా ధూళిపాళ్ల లవ్ సితార ట్రైలర్ రిలీజ్

శోభితా ధూళిపాళ్ల లీడ్ రోల్‌‌లో తెరకెక్కిన  వెబ్ మూవీ ‘లవ్ సితార’.  వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. శుక్రవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. కేరళలోని పచ్చని అందాల నడుమ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామా ఇది. స్వతంత్ర భావాలున్న ఇంటీరియ‌‌ర్ డిజైన‌‌ర్‌‌ తారగా శోభిత కనిపించింది.  మలయాళీ అయిన ఆమె.. ఓ పంజాబీ చెఫ్ అర్జున్‌‌ (రాజీవ్ సిద్ధార్థ) తో ప్రేమలో పడుతుంది. 

రెండు ఫ్యామిలీస్‌‌ను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో కేరళలోని తమ విలేజ్‌‌కు వెళ్తారు.  అక్కడ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఎమోషన్స్‌‌ను ఎలివేట్ చేస్తూ ట్రైలర్‌‌‌‌ కట్ చేశారు. ఈ జంట ప్రేమ ప్రయాణం ఏమైంది అనేది మిగతా కథ.  నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత నుంచి వస్తున్న సినిమా ఇది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌‌‌‌లో నటించానని, చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని శోభిత చెప్పింది. సెప్టెంబర్‌‌‌‌ 27 నుంచి జీ 5 ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది.