Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్స్టా పోస్ట్

బ్యూటీ శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ (Monkey Man). ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ దేవ్ పటేల్ (Dev Patel) నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించాడు. అయితే ఈ మూవీ అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్లో చోటు సంపాదించుకోవడంతో పాటు రాటెన్ టొమాటోస్‌ బెస్ట్ యాక్షన్ మరియు అడ్వెంచర్ విభాగంలో గెలుపొందింది.

మంకీ మ్యాన్ మూవీ సక్సెస్ను తాజాగా నటి శోభితా ఇన్ స్టా ద్వారా షేర్ చేసింది. “నేను కలలు కంటున్నానా లేదా ఏమిటి? ‘మంకీ మ్యాన్’ బాఫ్టా ఆమోదం పొందడంతో పాటు రాటెన్ టొమాటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీగా అగ్ర స్థానంలో నిలిచింది. మంకీ మ్యాన్ యాక్షన్ మరియు అడ్వెంచర్ ఫిల్మ్ 2024 అని" శోభితా వెల్లడించింది.# IndieForLife అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)

ఇకపోతే మంకీ మ్యాన్ మూవీ సక్సెస్ ఫుల్ మూవీస్ అయిన 'డెడ్‌పూల్ & వుల్వరైన్', 'ది ఫాల్ గై', 'రెబెల్ రిడ్జ్' మరియు 'ట్విస్టర్స్'తో పాటు నామినేట్ చేయబడింది. దీంతో అక్కినేని వారి కోడలు శోభిత.. రెండు నెలలు తిరగకముందే గుడ్ న్యూస్ చెప్పింది అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.ఇప్పటి వరకూ తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో తన ప్రతిభను చాటుకున్న శోభిత.. ఈ హాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది.

ALSO READ | SankranthikiVasthunnam: వెంకటేష్ అఖండ విజయం.. బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్తో దూసుకెళ్తోన్న సంక్రాంతికి వస్తున్నాం

ఇక మంకీ మ్యాన్ సినిమా విషయానికి వస్తే.. అవినీతి, అస్తవ్యస్తమైన ప్రపంచంలో విముక్తి కోసం ప్రయత్నిస్తున్న మాజీ దోషి గురించి యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ గా రూపొందింది. మంకీ మ్యాన్ పేరుకి హాలీవుడ్ సినిమానే అయినా అందరు ఇండియన్ యాక్టర్సే ఉన్నారు. ఈ సినిమాలో దేవ్ పటేల్ కు జోడీగా శోభితా దూళిపాళ నటించింది. బాలీవుడ్ యాక్టర్స్ మకరంద్ దేశ్‌పాండే, సిఖందర్ ఖేర్ విలన్స్ గా కనిపించారు. షార్ల్టో కోప్లీ, పిటోబాష్ మరియు విపిన్ శర్మ సహాయక పాత్రల్లో నటించారు.