నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు. నేడు ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీకి ఓవర్సీస్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ క్రమంలో నాగచైతన్య భార్య శోభిత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
తండేల్ రిలీజ్ సందర్భంగా భర్త నాగచైతన్యను ఉద్దేశించి శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 'ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ' అంటూ శోభిత చేసిన ఇన్స్టా పోస్ట్ అక్కినేని ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటిఫుల్ క్యాప్షన్తో పాటు మరో ఇంట్రెస్టింగ్ లైన్స్తో తండేల్ సినిమాపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది.
"తండేల్ సినిమా చేసేటప్పుడు నువ్వు ఎంత ఫోకస్డ్‌గా, పాజిటివ్‌గా ఉన్నావో ప్రత్యక్షంగా చూశానని, ఈ ఎక్స్‌ట్రార్డినరీ లవ్‌స్టోరీని థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చూసేందుకు ఆడియెన్స్‌తో పాటు నేను కూడా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని" శోభిత ఈ పోస్ట్‌ను చైకి ట్యాగ్ చేసింది. శోభిత పోస్ట్‌కు థాంక్యూ బుజ్జితల్లి అంటూ నాగచైతన్య రిప్లై ఇవ్వడంతో ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తోంది.
Also Read :- స్టార్ హీరో కొడుకు కోసం.. కదిలొస్తున్న ఇండస్ట్రీ స్టార్స్
తండేల్ సినిమా కోసం లాంగ్ హెయిర్, మ్యాసీ గడ్డంతో రగ్గడ్‌గా ఇంటెన్స్ లుక్‌లో చైతూ మేకోవర్ అయ్యాడు. తండేల్ రాజు పాత్రలో కనిపించడానికి ఎన్నో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏడాదిగా నాగ చైతన్య గడ్డంతో ఉన్నాడు. అంతెందుకు చివరికి తన పెళ్ళిలో కూడా షేవ్ చేసుకోలేదు.
తండేల్ కథ నిజ జీవితానికి సంబంధించింది కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరి ప్రేమికుల ప్రేమకు, దేశభక్తిని జోడించి చందు తెరకెక్కించిన తండేల్ సినిమాకు ఓవర్సీస్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో చై, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్స్కి ప్రేక్షకులు ఫిదా అవుతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.
2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది. ఈ కథ వెనుక ఉన్న నిజ జీవిత ప్రేరణ ప్రేక్షకులతో గాఢంగా ప్రతిధ్వనిస్తుందని ట్రేడర్స్ భావిస్తున్నారు.