హైదరాబాద్: మహిళల ఎథ్నిక్ వేర్ బ్రాండ్ సోచ్ తన కొత్త స్టోర్‌ను హైదరాబాద్ నగరంలో ప్రారంభించింది. అబిడ్స్ లో 2200 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో 20 స్టోర్లను సోచ్ నిర్వహిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభించిన స్టోర్‌లో బ్రాండ్ తాజా కలెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. స్టోర్ ప్రారంభం సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈవొ వినయ్ చట్లానీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని వినియోగదారులకు మా నూతన కలెక్షన్ మొదలు అపారమైన అవకాశాలను సైతం అందించనున్నామన్నారు.