సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌లు చేసుడు తప్ప.. రికవరీలు చేయరా

  •     ఈజీఎస్‌‌‌‌లో ప్రజాధనం దుర్వినియోగం
  •     సిబ్బందిని నిలదీసిన ప్రజాప్రతినిధులు

గుడిహత్నూర్, వెలుగు: గుడిహత్నూర్‌‌‌‌ మండలంలో 2022-–23 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఈజీఎస్‌‌‌‌ పనులపై వారం రోజులుగా గ్రామాల్లో సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ జరుగుతోంది. సోమవారం స్థానిక ఎంపీడీఓ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ వివరాలను వెల్లడించారు. రూ.4 కోట్ల 39 లక్షలతో 634 పనులు జరిగాయని, ఆ పనులపై సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ చేపట్టినట్లు ఎస్టీఎం నరేందర్‌‌‌‌ వెల్లడించారు.

కాగా ఈజీఎస్​ సిబ్బంది తీరుపై ఎంపీపీ భరత్, జడ్పిటీసీ పతంగే బ్రహ్మానంద్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌లో లక్షల్లో అవకవతకలు జరిగాయని, బాధ్యులను సస్పెండ్‌‌‌‌ చేసినా.. రికవరీలు కాకపోయినా వారు ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తప్పులు జరిగాయి

వివిధ పంచాయితీల్లో చేపట్టిన సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌లో కొన్ని తప్పిదాలు జరిగి నిధులు దుర్వినియోగం అయ్యాయని సిబ్బంది సభా వేదికలో అంగీకరించారు. ముత్నూర్‌‌‌‌ తండా, గుడిహత్నూర్, మన్నూర్, తోషం గ్రామాల్లో ఉపాధి పనిచేయకున్నా చనిపోయినవారు, ఆశా వర్కర్లు, పంచాయతీ మల్టీపర్పస్‌‌‌‌ వర్కర్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. వీరిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని డీఆర్‌‌‌‌డీఓ అడిషనల్‌‌‌‌ పీడీ రవీందర్‌‌‌‌ రాథోడ్‌‌‌‌ వెల్లడించారు. ప్రజావేదికలో ఎంపీడీఓ బండి అరుణ, అసిస్టెంట్‌‌‌‌ పీడీ కృష్ణారావు,  బ్యాంకింగ్‌‌‌‌ అంబుడ్స్‌‌‌‌మెన్‌‌‌‌ వీణ, సర్పంచ్‌‌‌‌లు జాదవ్‌‌‌‌ సునీత, తిరుమల్‌‌‌‌ గౌడ్, ఎంపీటీసీ సగీర్, ఈసీ చిత్ర, పంచాయితీ సెక్రటరీలు, టీఏలు, ఎఫ్‌‌‌‌ఏలు పాల్గొన్నారు.