ఈ పిచ్చి ఏంటండీ : ఎయిర్ పోర్ట్ లగేజీ ట్రాలీ దగ్గర రీల్స్

ఈ పిచ్చి ఏంటండీ : ఎయిర్ పోర్ట్ లగేజీ ట్రాలీ దగ్గర రీల్స్

ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇటీవల జరిగిన కొన్ని రీల్స్ కు సంబంధించిన సంఘటలను చూస్తుంటే..ఇదే పిచ్చిరా బాబు అనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఫేమ్ అయ్యేందుకు ముఖ్యంగా యువత రీల్స్ మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఉన్నారు. వ్యూవర్స్ ఎక్కువ రావాలి.. లైకులు ఎక్కువ రావాలి సెలబ్రిటీ అయిపోవాలి అనే  కోరికతో కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా..మరికొంత మంది కేసుల పాలవుతున్నారు.అలాంటిదే ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

సుజాతా దహల్ అనే యూట్యూబర్ ఎయిర్ పోర్ట్ లో చేసిన రీల్స్  వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వివాదంగా మారింది. నెటిజన్ల ఆగ్రహం, విమర్శలకు తెరతీసింది. ఈ వీడియోలో ఎయిర్ పోర్ట్ కన్వేయర్ బెల్ట్ పై పడుకుని రీల్స్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా ఆమెది పిచ్చి, నిర్లక్ష్యం అని ఓ రేంజ్ తో తిట్టారు.  

ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆమె జుట్టు కన్వేయర్ బెల్ట్ లో చిక్కుకొని ఏదైనా జరిగితే అని ఆందోళన వ్యక్తం చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. కన్వేయర్ బెల్ట్ పై కూర్చున్నందుకు ఆమెకు 500 ఫైన్ వేయాలి అని డిమాండ్ చేశాడు. విమానాశ్రయంలో ఇలా ప్రవర్తించే వారిని అరెస్ట్ ఎందుకు చేయరు అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జరిమానా విధించాలని  కోరారు. 

ఇలా రీల్స్ చేసేటప్పుడు జరిగిన ప్రమాదాల గురించి మరో నెటిజన్ ఉదాహరణలు చూపాడు.. తన సోదరి కన్వేయర్ బెల్ట్ లో పడి  చేతి వేళ్లను కోల్పోయిందని ఉదహరిస్తూ హెచ్చరించాడు. 
ఏది ఏమైనా రీల్స్ పిచ్చిలో పడి ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా ప్రవర్తస్తే.. సెలబ్రిటీలు కావడం పక్కన పెడితే.. ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని నెటిజన్లు తీవ్రంగా హెచ్చరి స్తున్నారు. 

కొద్దిరోజుల క్రితం..ఢిల్లీ మెట్రోలో, నోయిడా రోడ్లపై ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ హంగామా అంతా ఇంతాకాదు.. హోలీ పండుగ సందర్భంగా  రంగులు పూసుకొని మెట్రోలో తోటి ప్రయాణి కులకు ఇబ్బంది కలిగించే  అసహ్యంగా బిహేవ్ చేశారు.. అంతటితో ఆగకుండా అదే అమ్మాయిలు నోయిడా రోడ్లపై బైక్ పై వెళుతూ..రోమాన్స్ సీన్స్ చేస్తూ రీల్స్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని పట్టుకున్నారు.. మీ ఇష్టారీతిన నడిరోడ్లపై రీల్స్ చేస్తూ.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తారా.. అని 37 వేల రూపాయల జరిమానా వేశారు. జరిమానా కట్టేందుక డబ్బులు లేక లబోదిబో మన్నారు ఆ అమ్మాయిలు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sujata Dahal (@sujita8104)