కాలం మారింది.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చేసినట్టే.. తాజా యగంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. క్రియేటివిటీపై జనాల ఫోకస్ అంతా ఇంతా కాదు.. అయితే ఇప్పుడు కొత్తగా క్రియేటివ్ చేద్దామనుకుందో ఏమో తెలియదు కాని ఓ మహిళ మాత్రం వరుడు కోసం యాడ్ ఇచ్చింది. ఈ యాడ్ సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అది కాస్త వైరల్ అయి.. నెటిజన్లు స్పందించారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న ఓ యువతి పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే .. తనకు కాబోయే భర్త రీల్స్ కూడా చేయాలని కండిషన్ పెట్టేంత వరకు వెళ్లింది. ఈ ప్రకటన వింతగా ఉన్నా.. ఆమె ఇచ్చిన ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు... ఆ యువతి వరుడు కోసం పెట్టిన కండిషన్స్ చూసి... అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వరుడు కమ్ రీల్స్ పార్ట్‌నర్ కోసం వినూత్న ప్రకటన ఇచ్చిన ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు రియా. తన పేరు రియా అని... తాను తన జీవిత భాగస్వామి మరియు రీల్ భాగస్వామి కోసం వెతుకుతున్నానని ఆమె ప్రకటన ఇచ్చింది. అందులో కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. అబ్బాయి కెమెరా చూసి సిగ్గుపడకూదట. అంతేకాదు.. తనతో కలిసి రిలేషన్ షిప్ రీల్స్ చేయాలని కూడా ఆమె స్పష్టంగా చెప్పేసింది. అంతేకాదు... మోయి-మోయి వంటి ట్రెండింగ్ మ్యూజిక్‌లో రీల్స్ చేయడంలో అనుభవం కూడా ఉండాలని ఈ ప్రకటనలో తెలిపింది. ఈ కండిషన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయా..? ఇవే కాదు... ఇంకా కొన్ని షరతులు కూడా పెట్టింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రియా.
అబ్బాయిది ఉమ్మడి కుటుంబం అయ్యి ఉండకూదని ప్రకటనలో తెలియజేసింది రియా. అంతేనా... తనను సంప్రదించే ముందు... అబ్బాయి అమెజాన్ మినీ టీవీలో ఉన్న హాఫ్ లవ్ అరేంజ్డ్ ప్రోగ్రామ్‌ని తప్పకుండా చూడాలట. అతనికి ప్రీమియర్ ప్రో గురించి తెలుసుండాలని.. రీల్స్, వ్లాగ్‌లను హ్యాండిల్ చేయగలిగి ఉండాలని ప్రకటన ఇచ్చింది. వరుడి కోసం ఇచ్చిన ప్రకటనలో.. వింత కండిషన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవేం కండిషన్స్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.
- ALSO READ | రెండో పెళ్లి రూమర్స్ పై స్పందించిన నటి ప్రగతి
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రియా ఇచ్చిన ఈ వెరైటీ మ్యాట్రియోనియల్ యాడ్ వైరల్ కావడంతో... అబ్బాయిల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఆ అమ్మాయికి భర్త కావాలా... ఎడిటర్ కావాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు రియా ప్రకటన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇవేం షరతులు అంటూ నివ్వెరపోతున్నారు. ఏం చేస్తాం... సోషల్ మీడియా యుగం అని సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో... ఇంకెన్ని వింతలు చూడాలో ఏమో అని.. చెవులు కొరుక్కుంటున్నారు.