శ్రద్ధా వాకర్ హత్యపై రీల్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పై విమర్శలు

శ్రద్ధా వాకర్ హత్యపై రీల్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పై విమర్శలు

గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ బాగా వాడుకున్నాడు. హత్యకు ముందు నిందితుడు అఫ్తాబ్  పూనావాలా, శ్రద్ధా వాకర్ కు మధ్య సంభాషణను ఓ వీడియో రూపంలో చేసి ఆన్ లైన్లో పోస్ట్ చేశాడు. వీడియో చివర్లో మాత్రం ఆమెకు న్యాయ జరగాలనే ట్యాగ్ లైన్ ను జతచేశాడు. ఈ వీడియోకు ముందస్తు హెచ్చరికగా అహింస, హత్య అనే పదాలను జోడించాడు. అయితే ఈ వీడియో ప్రజల్లో అవగాహన కల్పించేందుకే అని దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి చెప్పినా... నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వీడియోను ప్రదర్శించిన వ్యక్తిని ఆరుష్ గుప్తాగా గుర్తించారు. ఇతనికి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో మంచి ఫాలోయింగే ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ స్టాలో దాదాపు లక్షా 79వేల ఫాలోవర్లు ఉండగా.. యూట్యూబ్ లో 3లక్షల కంటే ఎక్కువ సబ్ స్ర్కైబర్స్ ఉండడం గమనార్హం. అయితే  ఆరుష్ చేసిన ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కంటెంట్ కోసం ఇలాంటి వీడియో చేస్తారా అని కొందరు మండిపడుతున్నారు. కేవలం లైకులు, ఫాలోవర్ల కోసమే ఈ వీడియో చేశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.