Supritha Video: గతంలో అలా చేసినందుకు క్షమించండి అంటూ సుప్రీత వీడియో.. ఏం జరిగిందంటే..?

Supritha Video: గతంలో అలా చేసినందుకు క్షమించండి అంటూ సుప్రీత వీడియో..  ఏం జరిగిందంటే..?

Supritha: ఐపీయల్ సీజన్ రానుండటంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.. దీంతో కొందరు కేటుగాళ్ళు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి డబ్బు ఆశని ఎరగా వేసి క్షణాల్లో వేలు, లక్షల సంపాదించవచ్చు అంటూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయిస్తున్నారు.. దీంతో ముల్లుని ముళ్ళుతోనే తీయాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తూ ఇదే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లని ఉపయోగిస్తూ బెట్టింగ్ యాప్స్ ని నిర్మూలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో బెట్టింగ్ యాప్స్ ని డిలీట్ చెయ్యాలని, బెట్టింగ్స్ ఆడద్దని అవగాహన కల్పిస్తున్నారు.. తెలుగు నటి సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా వినియోగించేవారికి సుపరిచితమే.. ఐతే సుప్రీత హొలీ సందర్భంగా బెట్టింగ్ ప్రమోషన్స్ పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులోభాగంగా మొదటిగా అందరికి హొలీ శుభాకాంక్షలు తెలియజేసింది.. ఆ తర్వాత కొంతంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తెలిసో తెలియకో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారని అందులో తాను కూడా ఒకరని తెలిపింది..

Also Read:-ఆర్ యూ వర్జిన్.?" అని అడిగిన నెటిజన్.. 

అయితే ఇప్పుడు తాను పూర్తిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పూర్తిగా ఆపేశానని, మీరు కూడా ఎవరైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తుంటే చూసి ప్రభావితం అవ్వకండని సూచించింది.. తాను గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు క్షమించాలని కోరింది.. ఈజీ మనీ కి అలవాటు పడవద్దని.. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారిని ఫాలో అవ్వద్దని తెలిపింది..

 

ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య సుప్రీత ఫోటో షూట్లు, వీడియోలు షేర్ చేస్తూ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఇన్స్టాగ్రామ్ లోదాదాపుగా 8 లక్షల పైచిలుకు ఫాలోవర్స్ ఉన్నారు. గతంలో సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ లేదంటూనే  హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..