సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేయడం…నచ్చిన పోస్టులను షేర్ చేసుకోవడం ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడంతా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ హవా నడుస్తోంది. బర్త్‌డే పార్టీ, సక్సెస్ మీట్.. పబ్లిక్ మీటింగ్…సోషల్ ఈవెంట్స్, రాజకీయ నాయకుల ప్రసంగాలు..ఇలా ఫంక్షన్ ఏదైనా సరే సోషల్ మీడియాలో లైవ్ రావాల్సిందే. ఇది ప్రజెంట్ యూత్ ట్రెండ్. పండగైనా, పబ్బమైనా సోషల్‌మీడియా మిత్రులను పలకరించాల్సిందే. ఈ లైవ్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతున్న వాళ్ల కోసమే ఫేస్బుక్,ట్విట్టర్,యూట్యూబ్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లైవ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఐఓఎస్, విండోస్ ఫోన్లకే పరిమితమైన ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ అందుబాటులోకి రావడంతో లైవ్ స్ట్రీమింగ్ ఇప్పుడు అందరికి హాట్ ఫేవరెట్ అయింది. లైవ్ స్ట్రీమింగ్ క్రేజ్‌పై యాక్టివ్ యూజర్స్‌లో కొందరిని అడిగితే ఇలా చెప్పారు.
ఈ ట్రెండ్ అలా మొదలైంది..
ప్రస్తుతం లైవ్ స్ట్రీమింగ్‌ని ఎక్కువగా వాడుతోంది ఫంక్షన్లకే . విదేశాలు, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల కోసం ఈ ఆన్లైన్ ప్రత్యక్షప్రసారం ట్రెండ్ మొదలైంది . ఇక ఈ ఇంటర్నెట్ యుగంలో బంధుమిత్రులే కాకుండా మొత్తం ప్రపంచమే మీ ఇంటి వేడుకని వీక్షిస్తుంది. ‘అంబరాన్నంటిన సంబరాల్ని అందరితోనూ ప్రత్యక్షంగా పంచుకోవడం సంతోషమే కదా!! అందుకే ఏ వేడుకనైనా ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఇంట్లోకి కొత్తగా చిన్న పిల్లలు వస్తే ఆ సందడే వేరు. వాళ్లకి సంబంధించిన ప్రతి విషయం చాలా ఆనందాన్నిస్తుంది. ఇక మామా అల్లుళ్ల బంధం అయితే అన్నింటికన్నా స్పెషల్. కానీ నా మేనల్లుడి అన్నప్రాసన రోజు నాకు ఎగ్జామ్. అది రాయకుండా ఉందామంటే ఫైనలియర్. ఫంక్షన్ పోస్ట్‌పోన్ చేసుకుందామంటే అదీ కుదరలేదు. ఇక చేసేదేం లేక నేను సైలెంట్ అయ్యాను. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చి ఫోన్ ఆన్ చేస్తే ఫేస్బుక్లో లైవ్ నోటిఫికేషన్. అక్కడే కూర్చొని ఫంక్షన్ అంతా లైవ్‌లో చూశాను. మా వాళ్లు అంత అప్డేట్ అయ్యారని నాకు అప్పుడే అర్థమయింది’ అన్నాడు కార్తీక్.
ఆశీర్వచనాలు ఉండాల్సిందే
ఎక్కడో ఉన్నవాళ్లకే కాదు.. కదలలేని పరిస్థితుల్లోనూ కొంతమంది ఉంటారు. వారికి ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా అక్కడికి వెళ్లలేకపోయామన్న బాధ ఉండదు. ఇంటర్నెట్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కళ్ల ముందే వేడుక ప్రత్యక్షమవుతుంది. ఎవరెంత దూరంలో ఉన్నా అందరి ఆశీర్వచనాలు ఉండాల్సిందే కదా! అందుకే ఆన్లైన్ స్ట్రీమింగ్ బెస్ట్ ఆప్షన్ అంటోంది సంధ్య.
రాజకీయాల్లోనూ లైవ్ స్ట్రీమింగ్
‘రాజకీయాల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ కీలకపాత్ర పోషిస్తోంది. వార్డు మెంబర్ మొదలుకొని రాష్ర్ట ముఖ్యమంత్రుల వరకు ప్రతి ఒక్కరు తమ కార్యకలాపాలకు సోషల్ మీడియా లైవ్‌ని వేదికగా మలుచుకుంటున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు చేపడుతున్న కార్యక్రమాలు నేరుగా ప్రజలు తిలకించే అవకాశం వచ్చింది. ప్రధాని మోదీ ప్రచార ప్రసంగాలు సైతం పలు సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల్లో నేరుగా లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి కదా’ అంటోంది కీర్తన.
టెక్నాలజీ ప్రియులు
టెక్నాలజీ ప్రియులైన యువత తమ వెడ్డింగ్ ఇన్విటేషన్లను ఆన్లైన్లో పంపటం మాత్రమే కాదు.. ఇప్పుడు పెళ్లిని కూడా ఆన్లైన్లో అందరికీ చూపాలని కోరుకుంటున్నారు. వివాహం కావాల్సిన వాళ్లను పెద్దలు ‘లైవ్ పెళ్లి ప్రాప్తిరస్తు’ అని దీవించే కాలం వచ్చేసింది. లైవ్ స్ట్రీమింగ్ సదుపాయం సుదూరంలో ఉండే వారికి కూడా వేడుకను వీక్షించే అవకాశం కల్పిస్తుంది. ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం కల్యాణానికి మరింత కళ తెస్తోంది. ‘ఖాళీగా ఉంటే ఫోన్ అంతా జల్లెడ పట్టడం నాకు అలవాటు. ఏం తోచక ఇన్‌స్ట్రాగ్రామ్ ఓపెన్ చేశాను. చూస్తే లైవ్‌లో నా చిన్నప్పటి క్లాస్మేట్ పెళ్లి. వాడు నన్ను పెళ్లికి పిలవలేదు అనుకోండి. కానీ ఆ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా అటుఇటు తిరుగుతూ ఫుల్ హడావుడి చేస్తున్నారు. ఫోన్‌ని కూడా అష్ట వంకరలు తిప్పుతున్నారు. వాళ్లని చూస్తే మనసుకి చాలా రిలాక్స్‌గా అనిపించింది’ అని చెప్పాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి దినేష్ కుమార్.
నెగెటివ్ కామెంట్స్ ఎక్కువే
‘నేను మోడల్‌గా పనిచేస్తున్నాను. నా ప్రొఫెషన్ వల్ల ఎప్పుడూ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లో యాక్టివ్‌గా ఉంటాను. ఎలాంటి అకేషన్ అయినా సరే ఫేస్బుక్ లైవ్‌కి వెళ్తాను, కొందరు నా ఇష్టాయిష్టాలను తెలుసుకోవడానికి ఏవేవో ప్రశ్నలు అడుగుతుంటారు. కొందరైతే పాటలు కూడా పాడమంటారు. వాళ్లని బాధ పెట్టడం ఇష్టం లేక ఏదో ఒక కూని రాగం తీస్తుంటాను. నా షోస్‌కి ముందు కూడా లైవ్‌కి వెళ్తాను. నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి. మొదట్లో కాస్త బాధగా అనిపించేది. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశాను.
కొన్ని సార్లు ఆ కామెంట్స్ చూస్తే నవ్వొస్తోంది’ అంటోంది శిల్ప.
హద్దులుండాలి
‘సంతోషాలను, వేడుకలను లైవ్‌లో పంచుకోవడంలో తప్పు లేదు.కానీ అంత్యక్రియలను సైతం ఫేస్బుక్ లైవ్‌లో పెట్టేస్తున్నారు కొందరు. యాక్సిడెంట్ అయితే సేవ్ చేయడం మానేసి లైవ్‌లో వాళ్లని చూపిస్తున్నారు. లైవ్‌లో ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. ప్రమాదకరమైన స్థలాలకు వెళ్లి ప్రాణాలను లెక్కచేయకుండా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాంటి వాళ్లను చూస్తే చాలా కోపమొస్తోంది’ అన్నాడు చంద్రశేఖర్.
యూట్యూబ్‌లో
వెయ్యిమంది ఫాలోవర్లుంటే లైవ్..
సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న ‘యూ ట్యూబ్’ లైవ్ స్ట్రీమింగ్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గతంలో పదివేలమంది ఫాలోవర్స్ ఉన్నవారికి మాత్రమే లైవ్ ఆప్షన్ ఇచ్చిన యూట్యూబ్ ఈ మధ్య ఆ సంఖ్యను వెయ్యికి సడలించింది. యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే కెమెరా ఐకాన్ కనిపిస్తుంది. ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే లైవ్ ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వొచ్చు. సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్‌ను షేర్ చేయొచ్చు.
ట్విట్టర్లో పెరిస్కోప్తో లైవ్..
సోషల్ మీడియాలో ఎక్కువమంది సెలబ్రిటీ యూజర్స్ ఉన్న మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ పామ్ ట్విట్టర్లోనూ లైవ్ పోస్ట్ చేయవచ్చు. పెరిస్కోప్ మీర్కట్ అనే హ్యాండిల్స్ ద్వారా ట్విట్టర్ లైవ్‌ను అందిస్తుంది. ట్విట్టర్ ఆధారిత సర్వీసుల్లోనూ పెరిస్కోప్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ యాప్‌కి దాదాపు పది మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ప్రతిరోజూ సుమారు రెండు మిలియన్ల మందికిపైగా ప్రతిరోజు పెరిస్కోప్ ఓపెన్ చేస్తున్నారని అంచనా. ఈ యాప్ ద్వారా ప్రపంచంలో నెట్ సౌలభ్యం ఉన్న ఎక్కడి నుంచైనా లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. ట్విట్టర్లో ‘మీర్కట్’ అనే మరో లైవ్ ఆప్షన్ ఉన్నప్పటికీ పెరిస్కోప్కే ఎక్కువ క్రేజ్ ఉంది.
ఇన్స్టాగ్రామ్లోనూ…
ముఖ్యమైన పోస్టులను స్టోరీలుగా చూపించే ఫీచర్‌ను అందిస్తున్న ఇన్స్టాగ్రామ్ సైతం లైవ్ వీడియోను షేర్ చేసుకునే ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ట్విట్టర్, ఫేస్బుక్ తరహాలో పెరిస్కోప్ వంటి యాప్స్ అనుసంధానంతో ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్ టెలికాస్ట్ చేస్తుంది,