జోరుమీదున్న డిజిటల్‌ మీడియా: సిన్మాను, పేపర్లను మించిపోనున్నది

జోరుమీదున్న డిజిటల్‌ మీడియా: సిన్మాను, పేపర్లను మించిపోనున్నది

రోజురోజుకీ పెరుగుతున్న ఇంటర్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌ యూజర్లతో డిజిటల్‌‌‌‌ మీడియా ఈ ఏడాదిలోనే సినిమాను, 2021 నాటికి ప్రింట్‌‌‌‌ మీడియాను వెనక్కి నెట్టి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కి చేరనుంది. 2021 నాటికి డిజిటల్‌‌‌‌ మీడియా వ్యాపారం సుమారు రూ. 35 వేల కోట్ల (5.1 బిలియన్‌‌‌‌ డాలర్లు) చేరుతుందని ఫిక్కి–ఈవై రిపోర్టు వెల్లడించింది. ఇండియాలో సినిమా రంగం విలువ 2018 లో రూ. 17,500 కోట్లని అంచనా. 2019 లో ఇది రూ. 19 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇక 2018 లో రూ. 30 వేల కోట్లున్న  ప్రింట్‌‌‌‌ మీడియా వాణిజ్యం 2019 లో రూ. 32 వేల కోట్లను మించుతుందని అంచనా వేస్తున్నారు. 2018 లో డిజిటల్ మీడియా  42 శాతం పెరిగి రూ. 16 వేల కోట్లకు ఎగసింది. ఫోన్‌‌‌‌ వాడే మొత్తం టైములో 30 శాతం ఎంటర్‌‌‌‌టెయిన్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసమే  ఇండియన్స్‌‌‌‌ వెచ్చిస్తున్నారని  ఫిక్కి–ఈవై రిపోర్టు తెలిపింది. 2019 నాటికి డిజిటల్‌‌‌‌ మీడియా రూ. 21 వేల కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌ యూజర్ల సంఖ్యలో ఇండియా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. చైనా మొదటి ప్లేస్‌‌‌‌లో నిలుస్తోంది.

ఇండియాలో ప్రస్తుతం 57 కోట్ల ఇంటర్‌‌‌‌నెట్ యూజర్లుండగా, వారి సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. 2018 లో ఇంటర్‌‌‌‌నెట్లో వీడియోలు చూసిన వారి సంఖ్య 32.5 కోట్లైతే, ఆడియో స్ట్రీమింగ్‌‌‌‌ వాడిన వారు 15 కోట్లు. ఇండియాలో 2021 నాటికి  ఓటీటీ వీడియో సబ్‌‌‌‌స్క్రయిబర్లు 3.5 కోట్లకు, ఆడియో సబ్‌‌‌‌స్క్రయిబర్లు 70 లక్షలకు పెరుగుతారని రిపోర్టు తెలిపింది. రాబోయే ఐదేళ్లలో ఇండియన్స్‌‌‌‌ ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌లో వీడియోలు వీక్షించే టైము మూడున్నర రెట్లు పెరుగుతుందని పేర్కొంది. టెలికం ఆపరేటర్లు కొత్త మల్టి–సిస్టమ్‌‌‌‌ ఆపరేటర్లుగా మారుతారని రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌ వినియోగంలో 60 శాతం వాటా టెల్కోలదే. 2021 నాటికి ఇది 75 శాతానికి చేరొచ్చని పేర్కొంది. ఇండియాలో  సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య 37.5 కోట్లకు చేరుతుందని తెలిపింది. తాజా ట్రాయ్‌‌‌‌ ఆర్డరు ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌కు మేలు చేస్తుందని ఫిక్కి–ఈవై రిపోర్టు అభిప్రాయపడింది.

ఇండియాలో మీడియా రంగం మొత్తానికి చూస్తే 2018 లో 13.4 శాతం పెరిగి రూ. 1.65 లక్షల కోట్లకు చేరిందని ఈ రిపోర్టు తెలిపింది. 2021 నాటికి ఇది రూ. 2.30 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది. 2018–2021 మధ్య కాలంలో ప్రధానంగా గేమింగ్ డిజిటల్ మీడియాల కారణంగానే వృద్ధి సాధ్యపడుతుందని పేర్కొంది. అత్యధిక ఆదాయం ఆర్జించేదిగా టెలివిజన్‌‌‌‌ తన స్థానాన్ని కాపాడుకుంటుందని రిపోర్టు తెలిపింది. ఇండియాలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య 2017లోని 18.3 కోట్ల నుంచి 2018 నాటికి 27.8 కోట్లకు పెరిగారని ఫిక్కి–ఈవై రిపోర్టు వెల్లడించింది.2021 నాటికి ఆన్‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌ రెవెన్యూ రూ. 11 వేల కోట్లను దాటుతుందని పేర్కొంది. టెలివిజన్‌‌‌‌ రంగం 2018 లో 12 శాతం పెరిగి సుమారు రూ. 70 వేల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇండియా బ్రాడ్‌‌‌‌కాస్టర్లు అంతర్జాతీయంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2021 నాటికి వాటి రెవెన్యూలో 15 శాతం విదేశాల నుంచే లభిస్తుందని ఫిక్కి–ఈవై రిపోర్టు అంచనా వేస్తోంది.