
న్యూయార్క్: సోషల్ మీడియా వినియోగంపై గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ పలు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాను అతిగా వినియోగించడం వల్ల రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లపై మరింత నియంత్రణ తీసుకొచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. వెర్రి వ్యక్తుల కోసం సోషల్ నెట్‌వర్క్‌లు యాంప్లిఫైర్‌లుగా పని చేస్తుండటాన్ని తాము ఊహించలేదన్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్ తమను తాము నిజంగా తెలివైన రీతిలో మలచుకోకపోతే వాటిపై ఎక్కువ నియంత్రణ తప్పదేమోనని వాల్‌స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు.