ఎడపల్లిలో ఉపాధిహామీ సామాజిక ప్రజావేదిక : చందర్ నాయక్

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లిలో బుధవారం ఉపాధిహామీ సామాజిక ప్రజా వేదిక ర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా డీఆర్ డీ వో చందర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2022 జనవరి నుంచి 2023, మార్చి 31 వరకు ఉపాధి హామీలో జరిగిన పనులపై పనులపై సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 4 సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్ లోని అంశాలను బుధవారం ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. 

మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనుల్లో అవకతవకలు వెలుగు చూసినట్లు తెలిపారు. ఈ అంశాలను పరిశీలించిన డీఆర్ డీవో చందర్ నాయక్ అవకతవకలను సరిదిద్దడానికి ఉపాధి సిబ్బందికి 15 రోజుల సమయం ఇచ్చారు. ఈ లోపు సంబంధిత అధికారులకు సరైన ఆధారాలు సమర్పించకపోతే వారిపై రికవరీకి ఆదేశిస్తామని తెలిపారు. సమావేశంలో ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఎడపల్లి సర్పంచ్ ఆకుల మాధవి, జడ్పీటీసీ రజిత, సోషల్ ఆడిట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.