పాల్వంచ/పాల్వంచ రూరల్, వెలుగు : సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన సీఓఈ సెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ (బాలురు), దమ్మపేట, పాల్వంచ (బాలికలు), ములకలపల్లి, మణుగూరు, భద్రాచలం (బాలికలు), ఇల్లెందు కళాశాలలోని సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించారు.
2,611 మంది విద్యా ర్థులు దరఖాస్తు చేసుకోగా 2,509 విద్యార్థులు హాజరయ్యారు. 102 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్సీఓ ప్రత్యూష తెలిపారు. డీసీఓ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సై బాణాల రాము పరీక్షలను పర్యవేక్షించారు.