విద్యార్థిని అనుమానాస్పద మృతి

నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఐదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. సోన్ మండలం పాక్​పట్ల గ్రామానికి చెందిన మహిత (12) శుక్రవారం ఉదయం ఆస్తమా కారణంగా ఊపిరాడక మరణించినట్లు స్కూల్ సిబ్బంది చెప్పారు. అయితే పాప మృతిపై సర్పంచ్ విలాస్​, బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వీరిని  పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఆరా తీసిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.