పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సోషల్ వర్కర్ శాంతి దేవి కన్నుమూశారు. నిన్న రాత్రి ఆమె తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శాంతి దేవి సొంతూరు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా గుణ్ పూర్. శాంతి దేవి ప్రమఖ సమాజ సేవకురాలు. 1934 ఏప్రిల్ 18న ఆమె జన్మించారు. కొరాపూట్ లో ఆమె ముందుగా ఓ చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత శివ సమాజ్ ను రాయగడలో స్థాపించారు. ఆడపిల్ల అభివృద్ధియే ఈ శివ సమాజ్ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఆమె సమాజ సేవా కార్యక్రమాలు ఎక్కడా ఆగలేదు. శాంతి దేవి తన సేవా ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. గుణ్ పూర్ లో మరో ఆశ్రమాన్ని ఆమె ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమం అనాథలు మరియు నిరుపేద పిల్లలకు విద్య, పునరావాసం, వృత్తి శిక్షణ కోసం పనిచేసింది. శాంతి దేవి చేసిన సేవల్ని ప్రభుత్వం గుర్తించింది. సామాజిక సేవా ఉద్యమానికి ప్రధాన మార్గదర్శకురాలిగా గుర్తించి... ఆమెకు 2021 సంవత్సరంలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటైన ‘పద్మశ్రీ’తో ప్రభుత్వం సత్కరించింది.
Social worker & Padma Shri awardee Shanti Devi passed away last night at her residence in Gunupur, Rayagada district of Odisha
— ANI (@ANI) January 17, 2022
(file pic) pic.twitter.com/wI6scYOC5i
ఇవి కూడా చదవండి:
ఒక్క రోజే రెండున్నర లక్షల కరోనా కేసులు
పంజాబ్‌లో ఎన్నికలు వాయిదా వేయండి