జల్లాపల్లి ఆబాది గ్రామంలో .. అంగన్వాడీకి ఫర్నీచర్ అందజేత

 జల్లాపల్లి ఆబాది గ్రామంలో .. అంగన్వాడీకి ఫర్నీచర్ అందజేత

పోతంగల్, వెలుగు: పోతంగల్‌ మండలం జల్లాపల్లి ఆబాది గ్రామంలోని అంగన్వాడీ సెంటర్‌‌కు మండల మాజీ కోఆప్షన్ మెంబర్, సామాజిక సేవకుడు ఎంఏ హకీమ్‌ రూ.28 వేల విలువైన ఫర్నీచర్‌‌ అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్తులు ఆయనను సన్మానించారు.

 అంగన్వాడీ సెంటర్‌‌కు అవసరమైన టేబుళ్లు, కుర్చీలు, ర్యాక్‌లు, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు భోజనం ప్లేట్లు అందజేశారు. కార్యక్రమంలో లీడర్లు వివేక్, ఎజాస్ ఖాన్, ఇస్మాయిల్, భీమా, రాములు, యూత్ ప్రెసిడెంట్ ఆరిఫ్, హమీద్, షేరు, దేవీగింగ్, రాములు పాల్గొన్నారు.