
ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై సోషలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులోభాగంగా బెట్టింగ్ యాప్స్ ని ఎక్స్ పోజ్ చేసే క్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని దీంతో అన్వేష్ ఇండియాకి రాగానే కచ్చితంగా అరెస్ట్ చేయిస్తామని యువ సామ్రాట్ అన్నాడు.
అయితే అన్వేష్ గతంలో మరో ట్రావెల్ వ్లోగర్ భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుతూ అతడి తల్లిపై గలీజ్ వ్యాఖ్యలు చేశాడు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే బదులు తన తల్లిని డబ్బు కోసం వ్యభిచారం చెయ్యాలంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తల్లి గురించి కూడా ఇదే రీతిలో మాట్లాడాడు. ఇమ్రాన్ తల్లి ఓల్డ్ సిటీలో వ్యభిచారం చేసేదని అన్నాడు. అలాగే ఇమ్రాన్ తండ్రి బ్రతుకుతుండగానే చనిపోయాడంటూ వ్యక్తిగత దూషణకి పాల్పడ్డాడు.
ఆటగాళ్లు.. అంటూ డైలాగులు చెబుతూ విదేశీ మహిళలని తన వీడియోలలో చూపిస్తూ కించపరిచేలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషలిస్టులు అన్వేష్ పై కేసులు పెడతామని అలాగే అరెస్టు చేయిస్తామని అంటున్నారు. మాజీ ఐపీఎస్ సజ్జనార్ అండ చూసుకుని రెచ్చిపోతున్నాడని.. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిని ఎక్స్ పోజ్ చేసే క్రమంలో తాను చేస్తున్న వ్యాఖ్యలు మర్చిపోతున్నాడని చర్యలు తప్పవని అంటున్నారు.. మరి ఈ విషయంపై అన్వేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..