ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి సింగిల్‌విండో చైర్మన్ మల్లికార్జున్, ఆరుగురు సొసైటీ డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్రాజ్ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్గున్నయ్య, ఆరుగురు సొసైటీ డైరెక్టర్లు కాంగ్రెస్‌లో చేరడంతో రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి సాదారంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువాకప్పి చైర్మన్, వైస్ చైర్మన్, ఆరుగురు డైరెక్టర్లను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన మల్లికార్జున్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు ప్రధానఅనుచరుడు ఆయనతో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు చేసి ప్రజాసంక్షేమంకోసం పాటు పడుతుందని ఇందుకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్రాజ్, జేసీబీ శ్రీనివాస్, చెలిమెల నర్సయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, తలకొక్కుల మహేందర్, పాల్గొన్నారు.