రాంగోపాల్ పేట అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం పరిశీలించారు. అధికారులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగేది కాదని చెప్పారు. పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
బిల్డింగ్ కూల్చే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోదండరాం సూచించారు. నిపుణులతో జాగ్రత్తగా సర్వే చేయించి.. నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని అన్నారు. మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రభుత్వానికి హెచ్చరిక వంటిదన్నారు. అక్రమ కట్టడాలపై న్యాయపోరాటం చేస్తామని.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కోదండరాం హెచ్చరించారు.