న్యూఢిల్లీ : ఓయో బోర్డులోకి సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన వ్యక్తి మెంబర్‌గా జాయిన్ కానున్నారు. ఓయో పేరెంట్ కంపెనీ ఓరవెల్ స్టేస్ లిమిటెడ్ సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ ఎండీ సుమెర్ జునెజాను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. దీనికి ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం) లో షేర్‌హోల్డర్ల అప్రూవల్స్ రావాల్సి ఉంది. సాఫ్ట్‌బ్యాంక్ నామినీ డైరెక్టర్‌గా ఓరవెల్ స్టేస్‌లో సుమెర్ జాయిన్ అవుతారు.
ఓయో లాభాల్లోకి వస్తోందని, ఈ కంపెనీపై సాఫ్ట్‌బ్యాంక్ బుల్లిష్‌గా ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఓయో 2023–24 లో మొదటిసారిగా లాభాల్లోకి వచ్చింది. సుమారు రూ.100 కోట్ల ప్రాఫిట్ సాధించిందని కంపెనీ ఫౌండర్ రితేష్ అగర్వాల్ గతంలో ఎక్స్‌లో పేర్కొన్నారు.