టెక్ కంపెనీల అడ్డా 'హైదరాబాద్‌'.. ‌‌‌‌‌‌‌రెంట్లు తక్కువ.. ట్యాలెంట్​ఎక్కువ

  • ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  34 శాతం పెరిగిన ఆఫీస్ లీజులు
  • సిటీలో పెరుగుతున్న  టెక్, ఐటీ కంపెనీల ఆఫీసులు, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీ సెంటర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలోని మిగిలిన మెట్రో సిటీలతో  పోలిస్తే  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆఫీసులను ఓపెన్ చేయడానికి టెక్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు (ఎంఎన్‌‌‌‌‌‌‌‌సీలు) తమ ఆఫీసులను ఓపెన్ చేశాయి. ఇండియాలో తమ హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్లను ఏర్పాటు చేయడానికి  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకుంటున్నాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దేశం మొత్తం మీద లీజుకిచ్చిన ఆఫీసు స్పేస్‌‌‌‌‌‌‌‌లో 14 శాతం వాటా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ఉంది. 

కిందటేడాది జనవరి–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 66 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ కనిపించగా, ఈ ఏడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో 87 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను డెవలపర్లు లీజుకు ఇచ్చారు. ఇది 34 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌కు సమానం.    ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి,  రాయదుర్గం  ఏరియాల్లో ఆఫీస్ స్పేస్ లీజులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా టెక్, ఐటీ కంపెనీలు ఈ ఏరియాల్లో ఆఫీసులను ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గూగుల్‌‌‌‌‌‌‌‌, కాగ్నిజెంట్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ వంటి  పెద్ద కంపెనీలు తమ  సెంటర్లను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాయి. 

ఐటీ, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, టెక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీ) సెక్టార్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా 200 ఎకరాల ఏఐ క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించడం కలిసి వస్తోంది. దేశంలోని మిగిలిన మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ ధరలు తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ట్యాలెంట్ ఉన్న యువత అందుబాటులో ఉండడం, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగ్గా ఉండడంతో పెద్ద టెక్ కంపెనీలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను  ఎంచుకుంటున్నాయి. సిటీలో టెక్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ మెరుగవుతోంది. 

ఆఫీస్ స్పేస్ డిమాండ్ 7 కోట్ల చదరపు అడుగులకు..

దేశంలోని టాప్ ఆరు  సిటీలలో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో  5.51 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ను డెవలపర్లు లీజుకు ఇచ్చారు. ఏడాది ప్రాతిపదికన  30 శాతం గ్రోత్ నమోదైంది.  ఆఫీస్‌‌‌‌‌‌‌‌ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది చివరి నాటికి ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, చెన్నై, పూణెలో   7 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని  ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ అడ్వైజరీ కంపెనీ సావిల్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా డేటా ప్రకారం, కిందటేడాది మొత్తంలో లీజుకు ఇచ్చిన ఆఫీస్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌ను  ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లోనే చేరుకున్నాం.  

ఈ ఏడాది చివరినాటికి ఆఫీస్ స్పేస్ డిమాండ్ 7–7.4 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.02 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ను డెవలపర్లు లీజుకు ఇచ్చారు.  ఏడాది ప్రాతిపదికన 28 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ రికార్డ్ అయ్యింది. ఇందులో  బెంగళూరు, ఢిల్లీ ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ముంబై మూడు సిటీల వాటా 66 శాతంగా ఉంది. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తుండడంతో టెక్‌‌‌‌‌‌‌‌తో సహా అన్ని సెక్టార్లలో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్ పెరిగిందని సావిల్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎండీ నవీన్ నండ్వాని అన్నారు. డిమాండ్ కొనసాగుతుందన్నారు.