మేడ్చల్ జిల్లా కీసరలో విషాదం.. ప్రాణాలు తీసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని

మేడ్చల్ జిల్లా కీసరలో విషాదం.. ప్రాణాలు తీసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కీసర దయారలో  యువతి ఆత్మ హత్య చేసుకోవడం కలకలం సృస్టించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. మృతురాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన ప్రవలికగా గుర్తించారు. 

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పటిల్ కి తరలించారు. సూసైడ్ కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.