లోన్ యాప్స్ వేధింపులకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

లోన్ యాప్స్ వేధింపులకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

లోన్ యాప్స్ వేదింపులకు యువకులు బలి అవుతున్న ఘటనలు పెరిగి పోతున్నాయి. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా సులువుగా అందుతున్న లోన్లు తీసుకోవడం.. చెల్లించలేని పరిస్థితుల్లో యాప్స్ నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నానయి. తాజాగా హైదరాబాద్ లో ఇంట్లో ఉరేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన నిమ్మల బోయిన సందీప్ (29) హైదరాబాద్ లో ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తీసుకున్న లోన్స్ చెల్లించాలని యాప్ ఏజెంట్లు చేస్తున్న ఒత్తిడి భరించలేక శుక్రవారం (ఏప్రిల్ 4) హైదరాబాదులో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు స్వస్థలం అయిన సదాశివనగర్ మండల కేంద్రంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. 

Also Read : హైదరాబాద్లో ఏడేళ్ల బాలుణ్ని తలపై రాళ్లతో కొట్టి పొదల్లో పడేశారు

మృతుడు సందీప్ క్రెడిట్ కార్డు ద్వారా అవసరానికి మించి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వరుసగా నష్టాలు రావడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా పేర్కొన్నారు. సందీప్ కు గత ఐదు నెలల క్రితమే వివాహం జరిగిందని, ఇంతలోనే ఇలా జరగిందని కుటుంబ సభ్యులు వాపోయారు.