మాదాపూర్: దుర్గం చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ తీగల వంతెన సమీపంలోని దుర్గం చెరువులో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయిన యువకుడిని నంబూరి చాణిక్య వర్మగా (24) పోలీసులు గుర్తించారు. చాణక్య వర్మ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. శుక్రవారం తమ రూమ్ నుంచి వెళ్లిన చాణక్యవర్మ తిరిగి రాకపోయేసరికి అతనికి తెలిసిన వారికి కాల్ చేసి రూంమేట్స్ ఆరా తీశారు.
ఆచూకీ తెలవకపోవడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అతని రూంమేట్స్ ఫిర్యాదు చేశారు. ఆదివారం చాణక్య వర్మ మృతదేహం దుర్గంచెరువులో దొరికింది. చాణక్య వర్మ స్వస్థలం విజయనగరంగా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాదాపూర్ పోలీసులు ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.