ఫేస్ బుక్ లైవ్ లో.. ఉరేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్లు  సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తన భర్త టార్చర్ చేశారని   ఆవేదన వ్యక్తం చేసింది.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

రాజస్థాన్ లో ని ఓ ప్రైవేట్ కంపెనీలో  సన ఆమె భర్త  హేమంత్  సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఐదు నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో హైదరాబాద్ లో ని నాచారంలో ఉంటుంది సన. అప్పటి నుంచి తన భర్త హేమంత్ చిత్రహింసలు పెడుతున్నాడని వేధిస్తున్నాడని ఫేస్ బుక్ లైవ్ పెట్టి సూసైడ్ చేసుకుంది సన. 

సన తన బిడ్డతో  డ్యాన్స్ లు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో  ఆనందంగా ఉన్న తమ కూతురు  ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన బిడ్డ ఆత్మహత్యకు కారణమైన హేమంత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.