హైదరాబాద్ రామంతపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామంతపూర్ లోని క్లైంట్ సర్వీస్ సొల్యూషన్స్ (సీఎస్ టెక్నాలజీ) లో కస్టమర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తున్న పిన్నపాటి హరిత (24) తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
తుకారం గేట్ నార్త్ లాలాగూడ, సికింద్రాబాద్ కు చెందిన పినపాటి రమేష్ (64) కు ఇద్దరు కూతుళ్లు. ఇటీవలే పెద్ద కూతురు పెళ్లి అయింది. చిన్న కూతురు హరిత క్లైంట్ సర్వీస్ సొల్యూషన్స్ లో కస్టమర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వర్తిస్తుంది. అక్టోబర్ 21న యధావిధిగా సాయంత్రం ఐదు గంటలకి డ్యూటీకి వెళ్లి అక్టోబర్ 22 న ఉదయం నాలుగు గంటలకు రావాల్సి ఉండగా రాలేదు.. రాత్రి 2 గంటలకు హరిత టీం లీడర్ నుంచి తండ్రి రమేష్ కి కాల్ చేసి ఈ విషయం చెప్పారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు.. ఇబ్బందుంటే నాకు కాల్ చేయండి: మహిళా కమిషన్ చైర్ పర్సన్ శారద