ప్రేమ పేరుతో మోసం.. ఉరివేసుకుని సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

ప్రేమ పేరుతో మోసం.. ఉరివేసుకుని సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని మహిళా సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. అత్తాపూర్ లోని హ్యాపీ హోమ్ ఫార్చూన్ అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న ఓ యువతి.. తన ప్లాట్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు. 

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ చేసుకున్న యువతిని.. అతిథి భరద్వాజ్ గా పోలీసులు గుర్తింంచారు.  ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్న యువతి... తనను వాడుకొని మోసం చేయడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అత్తాపూర్ పోలీసులు వెల్లడించారు.