డిప్రెషన్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగి సూసైడ్!

డిప్రెషన్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగి సూసైడ్!

పంజాగుట్ట, వెలుగు: ఒంటరిగా ఉంటున్న ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి డిప్రెషన్​లో ఉరేసుకొని చనిపోయాడు.  హైదరాబాద్ మౌలాలికి చెందిన జి. శ్రీకాంత్​(31) సాఫ్ట్​వేర్ ​ఉద్యోగి. విశాఖకు చెందిన శ్రీలతతో అతనికి 2012లో పెండ్లి అయింది.  వీరికి ఒక కూతురు ఉండగా, మనస్పర్థలు రావడంతో 2022లో భార్యతో విడిపోయాడు. 

ఆ తర్వాత పంజాగుట్ట ఎల్లారెడ్డిగూడ సుభాష్​నగర్ లోని ​విజయ్ కరణ్ ​అపార్ట్ మెంట్​లో ఒంటరిగా  ఉంటున్నాడు. ఇటీవల ఉద్యోగం మానేసిన శ్రీకాంత్​కు తన తల్లి దుర్గాంబ మంగళవారం ఫోన్ చేయగా, లిఫ్ట్ ​చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె బుధవారం శ్రీకాంత్​గదికి వచ్చి చూడగా, ఇంట్లో ఉరేసుకొని చనిపోయి కనించాడు.  పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. డిప్రెషన్​కారణంగానే శ్రీకాంత్ ​ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.