బ్లాక్లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. కొండాపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారనే సమాచారంతో వెళ్లిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు నుంచి వద్ద నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు సంబంధించిన 15 టికెట్లను, మూడు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పటాన్‌చెరు ఇస్నాపుర్ కు చెందిన మధుబాబు,సైనిక్ పురికి చెందిన మాథ్యూ రోడ్రిక్స్, గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఉండే నిజంతన్ ను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . వీరు ఒక్కో ఐపీఎల్ టికెట్ ను రూ.10 వేల నుంచి రూ. 15 వేలకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక 2024 .. మే 8న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ టికెట్ల బుకింగ్‌లు పేటిఎంలో ఓపెన్ అయ్యాయి. మిగిలిన మ్యాచులతో పోలిస్తే ఈ మ్యాచ్ టికెట్ల రేటు తక్కువగానే ఉంది. మే 8న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదారబాద్ తలపడనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచి రెండింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.